ఏ హీరోలో లేని ఆ సూపర్ క్వాలిటీ ..మన మహేశ్ బాబు లో మాత్రమే ఉందని మీకు తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు లో ఉన్న హిడెన్ టాలెంట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా కోడైకూస్తుంది . ఈ విషయాన్ని స్వయాన మహేష్ బాబునే బయట పెట్టడం గమనార్హం. గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా యాంకర్ సుమ కనకాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ..తన హిడెన్ సీక్రెట్ ను బయటపెట్టాడు .

ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”ఎస్ మీరు అనింది నిజమే ..నాలో ఒక హిడెన్ టాలెంట్ ఉంది .. నేను ఎవరినైనా సరే ఇట్టే ఇమిటేట్ చేయగలను.. ఇమిటేట్ చేయడంలో నేను బెస్ట్ రెండు గంటలను ఎవర్నైనా సరే గమనిస్తే అచ్చం వాళ్ళలాగే మారిపోయి ఇమిటేట్ చేయగలను. మా నాన్నకి కూడా నాలో ఈక్వాలిటీ ఉండడం చాలా చాలా నచ్చింది “.

“వాళ్లలాగే హావ భావాలను కూడా పలికించగలను.. చాలాసార్లు ట్రై చేశాను కూడా” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. దీంతో సుమ కనకాల సైతం షాక్ అయిపోయింది . అంతేకాదు ఈ హిడెన్ టాలెంట్ తెలుసుకున్న అభిమానులు ఖుషీ అయిపోతున్నారు . ప్రస్తుతం మహేష్ బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇంకా మన మహేశ్ బాబులో ఎన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నాయో..?