బాలయ్య 109వ సినిమాకి చిరు స్పెషల్ విషెస్.. మ‌రోసారి వాళ్ళ‌ స్నేహాని ప్రూవ్ చేసుకున్నారుగా..!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో బాలయ్య, చిరంజీవికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు టాలీవుడ్ లో ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు వీరిద్దరి ఫ్యాన్స్ మధ్యన హోరాహోరీగా పోరు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ హీరోలు మాత్రం ఎప్పుడూ వారిద్దరు స్నేహాన్ని ఏదో రకంగా ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. గతంలో కూడా ఎవరి ఇంట్లో ఫంక్షన్ జరిగినా వీరిద్దరూ కనిపించే సందడి చేసేవారు. అయితే గత కొంతకాలంగా వీరి పనులతో దూరంగా ఉన్నప్పటికీ స్నేహం మాత్రం ఇప్పటికీ అలానే ఉందని మెగాస్టార్ చిరంజీవి మరోసారి ప్రూవ్‌ చేశారు.

ప్రస్తుతం చిరు హీరోగా విశ్వంభ‌ర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకుడుగా వశిష్ట వ్యవహరిస్తున్నాడు. మరోపక్క చిరు కో స్టార్ అయిన నందమూరి నట‌సింహం బాలకృష్ణ కూడా కొల్లి బాబీ డైరెక్షన్లో తన 109వ‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఓ మాసివ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. చిరుతో వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషన్ హిట్ త‌ర్వాత‌ బాలయ్యతో.. బాబి తన వర్క్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమా విషయంలో మెగాస్టార్ తన స్పెషల్ విషెస్ తెలియజేశారు అంటూ బాబి వివరించాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేసిన బాబీ మాట్లాడుతూ.. నేను బాలయ్య గారితో సినిమా మొదలు పెట్టేటప్పుడు చిరంజీవి గారు కాల్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారని.. మన సినిమా కంటే బాలయ్య సినిమా మరింత పెద్ద హిట్ కొట్టాలని చిరంజీవి చెప్పాడని బాబీ వివరించాడు. దీంతో బాలయ్య, చిరంజీవి మధ్యన స్నేహం ఇప్పటికీ అలానే ఉంది అనే అంశంపై అంద‌రికి క్లారిటీ వచ్చేసింది. ఇక బాలయ్య సినిమా విషయంలో చెరువు చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ అంతా ఉమ్మ‌డిగా త‌మ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.