రౌడీ హీరో మూవీ నుంచి శ్రీ లీల అవుట్.. పిల్లకు వరుస డిజాస్టర్ ల దెబ్బ గట్టిగా తగిలిందే..

2023లో శ్రీ లీల హ్యాట్రిక్ సినిమాల‌తో అపజయాలను మూట కట్టుకున్న సంగతి తెలిసింది. ఈ డిజాస్టర్ ల ఎఫెక్ట్ ఇప్పుడు ఆమె కెరీర్ పై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్‌ తిననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ నుంచి శ్రీ లీల ఔట్ అయిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ వచ్చేసింది. ఇటీవల ఈ ప్రచారం నిజమేనని టాక్ నడుస్తుంది. ఐఎండిబి సైట్లో వీడి 12 మూవీలో హీరోయిన్గా ఇన్నాళ్లు శ్రీ లీల పేరు కనిపించేది.. అయితే ప్రస్తుతం శ్రీ‌లీల‌ స్థానంలో హీరోయిన్గా రష్మిక మందన పేరు కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు.

శ్రీ లీల ప్లేస్ ను రష్మిక మందన కొట్టేసినట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ డిజాస్టర్స్ కారణంగానే శ్రీ‌లీల‌ను ఈ సినిమా నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది స్కంద, భగవంత్‌ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో శ్రీ లీల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో భగవంత్ కేసరి హీరోయిన్ గా కాకుండా ఇంపార్టెంట్ రోల్ ను ప్లే చేసింది. ఈ సినిమా మాత్రమే ఆమెకు సక్సెస్ ని తెచ్చి పెట్టింది. ఇక హీరోయిన్గా నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూడు సినిమాలు వరుస పరాజయాలు పాలవడంతో బాగా ఎఫెక్ట్ అయింది.

తాజాగా గుంటూరు కారం రిలీజ్ ఐ కలెక్షన్లు బాగున్న శ్రీ‌ లీల క్యారెక్టర్‌కు దారుణంగా ట్రోల్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవరకొండ మూవీ నుంచి శ్రీ లీలను తప్పించారట. ఇక వీజయ్‌తి గ‌తంలో రష్మిక మందన గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించి మెప్పించారు. వీరిద్దరి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అని ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. అంతేకాదు వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక మరోసారి రష్మిక, విజయ్ కలిసి నటిస్తే ఇది మూడో సినిమా అవుతుంది. ఇక వీడి 12 బడ్జెట్ కారణంగా ఆగిపోయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ పుకార్లకు సినిమా యూనిట్ చెక్ పెట్టింది. ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ మొదలవబోతుందని సమాచారం. ప్రస్తుతం పరశురామ్‌ డైరెక్షన్లో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్‌లో విజయ్ దేవరకొండ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే గౌతమ్ తిన్న‌నూరి డైరెక్షన్లో సినిమాను మొదలుపెట్టబోతున్నాడట రౌడీ హీరో. ఇక అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్య‌వహరిస్తున్న ఈ సినిమాకు షూటింగ్ పూర్తికాక ముందే ఓటిటి రైట్స్ అమ్ముడుపోయాయి. భారీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ సినిమా స్క్రీనింగ్ హక్కులను చేజక్కించుకున్నట్లు తెలుస్తుంది. దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.