అదే నా కెరీర్ టర్నింగ్ పాయింట్.. ఆ తర్వాతే ఈ వరుస విజయాలు.. శృతి హాసన్

గత కొంతకాలంగా తమిళ ముద్దుగుమ్మ శృతిహాసన్ ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ.. ఆమె పట్టిందల్లా బంగారం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత ఏడాది ఆమె కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2023 లో శృతి న‌టించిన అన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లుగా నిలిచాయి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న శృతి.. ఇటీవల సలార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది.

అప్పులు తీర్చడానికే ఆ సినిమాలో నటించా... కానీ... - Pawan Kalyan About His Financial Problems In Gabbar Singh Movie Time

ఇక ఇలీవ‌ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన శృతి హాస‌న్ మాట్లాడుతూ గబ్బర్ సింగ్ నా సినీ కెరీర్ మలుపు తిప్పిందని.. అక్కడ నుంచి వరుస విజయాలు దక్కడం మొదలైందని వివరించింది. ఏమే మాట్లాడుతూ గబ్బర్ సింగ్ కు ముందు నా కెరీర్ వేరుగా ఉండేదని.. ఈ సినిమా నా కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిందంటూ చెప్పుకొచ్చింది. కెరీర్‌లో తిరుగులేని కమర్షియల్ విజయాన్ని గబ్బర్ సింగ్ ఇచ్చిందని.. ఓ రకంగా ఈ సినిమా నా జీవితాన్ని మార్చేసిందని వివరించింది.

అంతకు ముందు కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేశాను.. కానీ ఊహించని సక్సెస్ రాలేదు. గబ్బర్ సింగ్ తర్వాత నా కెరీర్ మంచి ట్రాక్ లో పడింది అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఎప్పుడో 11 ఏళ్ళ క్రితం రిలీజై బ్లాక్ బాస్టర్ అయిన గబ్బర్ సింగ్ సినిమా గురించి శృతిహాసన్ ఇంకా గుర్తుంచుకుందంటే ఆమెకు ఏ రేంజ్ లో గబ్బర్ సింగ్ తర్వాత కలిసొచ్చిందో అర్థం చేసుకోవచ్చు.