పో..ఆఖరికి అది కూడా సంకనాకిపాయే.. ఇక పూజా హెగ్డే బ్రతుకు బస్టాండే..!!

ఉన్నది పాయే.. ఉంచుకున్నది పాయే.. ప్రజెంట్ పూజా హెగ్డే పరిస్థితి అలాగే తగలడింది . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రాలేదు అంటూ చాలా చాలా బాధపడింది . ఇక తన కెరియర్ క్లోజ్ అంటూ ఫిక్స్ అయిపోయింది . ఏదో గుడ్డిలో మెల్లగా రాకరాక ఒక ఆఫర్ వచ్చింది. రవితేజ తరువాత నటించే సినిమాలో అమ్మడు హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి.

దీంతో మళ్లీ ఇండస్ట్రీలో పూజా హెగ్డే తన పునర్ వైభవం అందుకోబోతుంది అంటూ జనాలు సంబరపడిపోయారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రాత్రికి రాత్రి ఈ ఆఫర్ చేతులు మారిపోయింది . ఈ సినిమాలో పూజా హెగ్డేను తప్పించి కన్నడ బ్యూటీ వసంత రుక్మిని ని పెట్టుకున్నట్లు తెలుస్తుంది . రీసెంట్గా ఆమె నటించిన “సప్త సాగరాలు దాటి ” సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే.

ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ కిగాను మెచ్చిన మేకర్స్ పూజాను తప్పించి యంగ్ బ్యూటీ ని చూస్ చేసుకున్నారట. దీంతో పూజ హెగ్డే చేతిలో ఉన్న ఒక్క ఆఫర్ కూడా చేజారిపోయినట్లుంది. ప్రజెంట్ వసంత్ రుక్మిణి పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది . అమ్మడు తెలుగులో పాగా వేయడానికి బాగా ట్రై చేస్తుంది అంటున్నారు జనాలు. త్వరలోనే బడా సినిమాలు కూడా అందుకోబోతున్నట్లు తెలుస్తుంది..!!