“పుష్ప గాడి రూలింగ్ స్టార్ట్ కాబోతుందిరోయ్”.. ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడ్చుకునే అప్డేట్ ఇచ్చిన సుకుమార్..!

ప్రజెంట్ సినీ లవర్స్ వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్న సినిమాలలో వన్ ఆఫ్ ద బిగ్ బడా సినిమా పుష్ప2. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే అభిమానులు పిచ్చెక్కినట్లు ఊగిపోతున్నారు . రీసెంట్గా సినిమాకి సంబంధించి ఒక ఫేక్ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది .

దీంతో సోషల్ మీడియాలో జనాలు పుష్ప2కి సంబంధించిన ఫేక్ వార్తపై బాగా టెన్షన్ పడ్డారు . పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అయితే కొన్ని కారణాల చేత ఆగస్టు 15న పుష్ప సినిమా రిలీజ్ కావడం లేదు అంటూ ప్రచారం చేశారు . అంతేకాదు పుష్ప 2 సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలి అంటూ సుకుమార్ ఫిక్స్ అయ్యాడు అని వార్తలు వినిపించాయి .

అయితే దీనిపై సుకుమార్ స్పందించారు. పుష్ప గాడి రూలింగ్ మరో 200 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయ్యారు. దీంతో సుకుమార్ బన్నీ కాంబోలో రాబోతున్న పుష్ప సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కాబోతున్నట్లు తేలిపోయింది. మొత్తంగా పుష్ప గాడి రూలింగ్ స్టార్ట్ కాబోతుంది..చూద్దాం ఎలాంటి రికార్డ్స్ బద్ధలు కొడుతాడొ మన బన్నీ..?