యానిమల్ సినిమాలో “నాన్న” అనే పదం ఎన్నిసార్లు వాడారో తెలుసా..? సందీప్ రెడ్డి వంగా సంచలన రికార్డ్..!

యానిమల్.. ఈ సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు సినీ చరిత్రను తిరగరాసింది. ఏకంగా 900 కోట్లు కలెక్ట్ చేసి అభిమానులకు మంచి అనుభూతిని కలగజేసింది . ఈ సినిమా అంతా ఫాదర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. రన్బీర్ కపూర్ నటన ఈ సినిమాకి హైలైట్ గా మారింది.

 

అనిల్ కపూర్ ఈ సినిమాలో తండ్రి పాత్రలో కనిపించి మెప్పించాడు . రష్మిక మందన్నా బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇప్పటికి జనాలు మర్చిపోలేకపోతున్నారు. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో మొత్తంగా నాన్న అనే పదం 196 సార్లు వినిపించింది అంటూ ఓ నెటిజన్ బయటపెట్టాడు .

నాన్న సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ సినిమాలో ఏకంగా నాన్న అన్న పదం 196 సార్లు సందీప్ రెడ్డి వంగ రాయడంతో అభిమానులు కూడా షాక్ అయిపోతున్నారు. సంవత్సరానికి ఒక సినిమా కాదు పది సంవత్సరాలకి ఒక సినిమా తెరకెక్కించిన ..ఇలాంటి సినిమానే తెరకెక్కించాలి అంటూ కోరుకుంటున్నారు జనాలు. త్వరలోనే సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు..!!