మరోసారి యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇస్తున్న నాచురల్ స్టార్.. నువ్వు నిజంగా గ్రేట్ సామి..

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతోమంది నటీనటులు అడుగుపెట్టి స్టార్ హీరోలుగా, స్టార్ సెలబ్రెటీస్ గా గుర్తింపు తెచ్చుకోవాలని తెగ కష్టపడుతూ ఉంటారు. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో వారు చేసిన సినిమాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో కష్టపడి స్టార్‌డంను సంపాదించుకున్న వారిలో నాచురల్ స్టార్ నాని ఒకడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఎప్పటికప్పుడు యంగ్ డైరెక్టర్లకు తమేంటో ప్రూవ్ చేసుకునే అవకాశాలు ఇస్తూ ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ ఉన్నాడు.

nani-1.jpg

అయితే ఇలా ఆయన నటించిన సినిమాలు అన్ని దాదాపు హిట్లుగా నిలిచాయి. తాజాగా నాని ఇప్పుడు మరో డైరెక్టర్ కు తనతో సినిమా తెరకెక్కించే అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పనిచేసిన శివ అనే ఒక అబ్బాయి నానికి ఎమోషనల్ స్టోరీ ని వివరించాడట.. ఆ స్టోరీ నచ్చడంతో నాని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే నాని వివేకాత్రేయ, శ్రీకాంత్ ఒద్దెల దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా చేయడానికి కూడా నాని ఇంట్రెస్ట్ చూపిస్తూ వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Top more than 138 natural star nani hairstyle - POPPY

ఇలాంటి నేపథ్యంలో నాని చిన్న దర్శకులకు పెద్ద హీరోగా మారిపోయాడు. ప్రతి ఒక్క చిన్న దర్శకుడు కూడా నానిని దృష్టిలో పెట్టుకుని కథను రాసుకొని తమ సత్తా నిరూపించుకుంటున్నారు నాని. మంచి స్టోరీ అనిపిస్తే చాలు ఆ డైరెక్టర్‌కి కచ్చితంగా అవకాశం ఇచ్చి ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకోవడానికి అండగా నిలబడుతున్నాడు. ప్రస్తుతం నాని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నిజంగానే నువ్వు గ్రేట్ సామి అంటూ నీలాంటి స్టార్ హీరో.. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం అంటూ నానిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.