తారక్ ” దేవర ” మూవీ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే..!

జనతా గ్యారేజ్ సక్సెస్ అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమా ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక తాజాగా హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ షెడ్యూల్ ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో ప్రత్యేకంగా ఓ సెట్ ను వెయ్యడం జరిగిందట. మరో రెండు వారాల పాటు ఈ షూటింగ్ జరగనుంది. ఇక ఈ సినిమా 2024 ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ప్రస్తుతం ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా థియేటర్ రైట్ కొనుగోలు చేసేందుకు పలువురు పెద్ద నిర్మాతలు ముందుకొస్తున్నారు. దేవర మూవీలో జాన్వి కపూర్ మరియు సైఫ్ అలీఖాన్ లు కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ సంచలనం సృష్టిస్తుంది. ఇక త్వరలోనే ఈ మూవీ పై మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.