“ఆ సీన్ అయిపోయాక ..గుక్క పట్టి ఏడ్చేశా”.. రష్మిక బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఆమె ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టుకునింది. రష్మిక మందన్నా రీసెంట్గా నటించిన సినిమా యానిమల్ . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా ఈ సినిమాలో ఇరగదీసారు .

మరి ముఖ్యంగా రష్మిక బోల్డ్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా మారింది . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక మందన్నా సినిమాకి సంబంధించిన ఓ విషయాన్ని బయటపెట్టింది. ఈ సినిమాలో ఆమె రన్బీర్ కపూర్ ని లాగిపెట్టి కొడుతుంది . అయితే ఆ సీన్ చెప్పినప్పుడు డైరెక్టర్ ఫస్ట్ భయపడి పోయిందట . అంత పెద్ద హీరోని ఎలా కొట్టాలి అంటూ టెన్షన్ పడిందట.

“సందీప్ రెడ్డి వంగ వచ్చి అతడే నీ హస్బెండ్ అనుకో.. నిన్ను టార్చర్ పెడుతున్నాడు ..నీలోని ప్రేమని కోపాన్ని ఒకేసారి నువ్వు చూపించాలి “అంటూ ఆ ఫీలింగ్స్ ని క్యారీ చేస్తూ లాగిపెట్టి కొట్టమన్నాడట . దీంతో సందీప్ రెడ్డివంగా చెప్పినట్లే మిగతావి ఏవి ఆలోచించకుండా లాగిపెట్టి కొట్టిందట . అయితే ఆ సీన్ అయిపోయిన తర్వాత రూమ్ లోకి వెళ్లి బాగా ఏడ్చేసిందట .ప్రజెంట్ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!