” హనుమాన్ ” మూవీపై మంచు మనోజ్ రివ్యూ.. ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని దక్కించుకుంది ఈ మూవీ.

అంతేకాదు భారీ కలెక్షన్స్ ని కూడా రాబడుతుంది. ఇక ఈ క్రమంలోని సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. ఇక తాజాగా మంచు మనోజ్ ట్వీటర్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు.

” ఇంద్ర సినిమాకు నాకు హనుమాన్కు మా ధైర్యవ్‌కు గూస్ బంప్స్ తెప్పించావు కదా తమ్ముడు తేజ సజ్జ. కిల్లర్ పర్ఫార్మెన్స్ ఇరగ్గొట్టేసావ్. 28 సంవత్సరాలకే రెండు జనరేషన్స్ ను కవర్ చేశావు. ఓకే ఒక్కడు ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన అద్భుతమైన చిత్రమిది. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది బ్రదర్ ” అంటూ రాసుకు వచ్చాడు. ప్రస్తుతం మంచు మనోజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.