” పుష్ప 2 ” షూట్ పై దిమ్మతిరిగే అప్డేట్..!

పాన్ ఇండియా స్టార్ అనే పేరు బన్నీకి ఇచ్చిన మూవీ పుష్ప. ఇక ఈ సినిమాకే సీక్వెల్ చేస్తూ తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి రెడీ అయ్యాడు అల్లు అర్జున్. ఇక రష్మిక మందన హీరోయిన్గా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ” పుష్ప 2 “.

ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక మేకర్స్ ఈ మూవీ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక తాజాగా ఈ షూటింగ్ పై ఓ లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తుంది. ప్రస్తుతం మేకర్స్ ఓ సూపర్ డ్యుయెట్ షూటింగ్ ని చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ షూట్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో తెరకెక్కిస్తున్నారట.

మరి ఆల్రెడీ గత సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ఎలాంటి ఆల్బమ్ ఇచ్చాడో మనందరికీ తెలిసిందే. ఇక పార్ట్ 2 కి మరో లెవెల్ సాంగ్స్ ఇస్తున్నాడని టాక్. మరి ఈ సినిమా ఆల్బమ్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఇక ఈ మూవీని సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది ఆగస్టు 15న పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ ముందుకి రానుంది.