రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఆ స్పెషల్ డేనే ‘ గేమ్ చేంజర్ ‘ రిలీజ్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్‌ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలో నటిస్తున్న సినిమా పై ప్రేక్షకుల్లో ఎప్పటికే మంచి అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తరువాత సోలోగా రామ్ చరణ్ నటించిన మొదటి మూవీ గేమ్ చేంజర్ కావడంతో సినిమా పై ఆశ‌క్తి నెల‌కొంది.

Game Changer': First track 'Jaragandi' from Ram Charan-Kiara Advani starrer  to be out on this date | Hindi Movie News - Times of India

ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా రోజులు అవుతున్న ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్‌లు బయటకు రాక‌పోవడంతో ప్రేక్షకులంతా కనీసం సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ అయినా బయటకు వస్తే బాగుండు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నటుడు, డైరెక్టర్ అయిన ఎస్ జె సూర్య సినిమాలో విలన్ పాత్రలో మెప్పించబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్.. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Ram Charan, Shankar's 'Game Changer' shoot cancelled at the last minute.  Here's why - India Today

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పైగా పూర్తయిందని.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమాను ఈ ఏడాది మార్చి నెలాఖరికల్లా పూర్తి చేసి.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని ముగించిన తరువాత అక్టోబర్ 2వ‌ తేదీన‌ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇక సినిమా రిలీజై ప్రేక్షకుల్లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.