కన్నప్ప నుండి నయనతార అవుట్..? ప్రభాస్ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కల నెరవేరబోతుందోచ్..!

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకి ఎగిరి గంతేసే న్యూస్ అనే చెప్పాలి. రెబల్ స్టార్ ప్రభాస్ కన్నప్ప సినిమాలో భాగమైన విషయం అందరికీ తెలిసిందే. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న ప్రభాస్.. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన శివుడి గెటప్ లో మనకు కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అంటూ తెలుస్తుంది .

అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా మూడు రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట ప్రభాస్ . అంతేకాదు ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయలేదట . పూర్తిగా ఫ్రెండ్షిప్ బేస్ మీద ఈ సినిమాను చేస్తున్నాడట . పైగా ఎప్పటినుంచో ప్రభాస్ శివుడి గెటప్ లో కనిపిస్తే చూడాలి అంటూ కృష్ణంరాజు వెయిట్ చేశారట . ఆయన చువరి కోరిక ప్రకారమే ఈ సినిమాలో నటిస్తున్నాడట ప్రభాస్ .

అయితే మొదటిగా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పార్వతి దేవి పాత్రలో నయనతార నటించబోతుంది అంటూ అంతా అనుకున్నారు . మేకర్స్ కూడా ఆమెని ఫైనలైజ్ చేసారట. కానీ లాస్ట్ మూమెంట్లో కొన్ని అనివార్య కారణాల చేత ఆమెను తప్పించాడట మంచు మనోజ్ . అంతేకాదు ఆ ప్లేస్ లోకి ట్రెడిషనల్ బ్యూటీ సాయి పల్లవి వచ్చినట్లు తెలుస్తుంది. తెరపై ప్రభాస్ సాయి పల్లవి జోడిని చూడాలి అని ఎప్పటినుంచో ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆ కల నెరవేరబోతుంది అంటూ పండగ చేసుకుంటున్నారు రెబల్ అభిమానులు..!!