“ఇకపై ఎవడైనా ఆ కూత కూస్తే”..ఒకే ఒక్క దెబ్బతో అందరి నోర్లు మూయించిన మహేష్ బాబు..!

మహేష్ బాబు గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు బాగా ట్రోల్లింగ్ కి గురి అవుతుంది . ఎంత ట్రోలింగ్ గి గురి అవుతుందో అంతే పబ్లిసిటీ పాపులారిటీ కూడా దక్కించుకుంటుంది . మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది .

టాక్ పరంగా నెగటివ్ అంటున్నారే కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం బ్రేకులు లేని బుల్డోజర్ల దూసుకుపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 212 కోట్లు కలెక్ట్ చేసి రీజినల్ సినిమా సంచలనం రికార్డును క్రియేట్ చేసింది . ఇప్పటివరకు తెలుగులో ఏ రీజినల్ సినిమా ఇలాంటి రికార్డులు క్రియేట్ చేయలేదు . అంతేకాదు ఎవరైతే మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అంటూ ట్రోల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేసాడు మహేష్ బాబు.

అందరిలా తొడ కొట్టడాలు.. మీసాలు మెలివేయడాలు లాంటివి చేయకుండా కూల్ అండ్ సాఫ్ట్ గా తన రికార్డులను తనే బద్దలు కొట్టేసుకున్నాడు. అదే ఘట్టమనేని హీరో స్పెషాలిటీ అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ . దీంతో గుంటూరు కారం సినిమా పోస్టర్స్ మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మహేష్ బాబు ప్రెసెంట్ జర్మనీలో ఉన్నారు. రాజమౌళి సినిమా పనుల కోసం జర్మనీ వెళ్లినట్లు తెలుస్తుంది..!!