పాము అంటే చచ్చేంత భయం.. బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టాక చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది . అవకాశాలు దక్కించుకోవడానికి ఎంత కష్టపడాలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అంతే కష్టపడాలి . ఏ హీరోయిన్ అయినా సరే తెలుగు – హిందీ – మలయాళం – హాలీవుడ్ ఏ భాష అయినా సరే కష్టపడితేనే ఆ హీరోయిన్ స్టార్ గా మారగలదు . అయితే కొందరికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా కొన్ని భయాలు కారణంగా కొన్ని సినిమాలను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది .

అలా వదులుకున్న సినిమాలు వేరే హీరోయిన్స్ చేసి హిట్ కొట్టి ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకొని ఉంటారు . ప్రెసెంట్ అలాంటి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. హీరోయిన్ జయప్రద ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన పనిలేదు . ఎవర్గ్రీన్ హీరోయిన్ ..ఆమె కట్టు – బొట్టు – అందం ఇప్పటి కుర్రాళ్లను కూడా ఆకట్టుకుంటాయి . 1986లో ఆమెకు “నాగిన్” సినిమాలో చేసే అవకాశం వచ్చింది .

అయితే నాగుపాముల నటించాలి అన్న భయం కారణంగా ఆమె ఈ ఆఫర్ ని వదులుకునిందట. మొదటి నుంచి పాము అంటే భయం గల జయప్రద ఈ సినిమా హిట్ అవుతుందని తెలిసినా కూడా వదులుకునింది . ఆ తర్వాత మేకర్స్ ఆ రోల్ కోసం శ్రీదేవిని చూస్ చేసుకున్నారు . ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!