“రష్మికతో లవ్.. త్వరలోనే ఎంగేజ్మెంట్” ..విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్ రష్మిక – హీరో విజయ్ దేవరకొండ లకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అయ్యాయో మనం చూసాం . మరీ ముఖ్యంగా రీసెంట్గా రష్మిక విజయ్ దేవరకొండ ల ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి 14వ తేదీ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది . రీసెంట్ గా దీనికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు .

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రష్మికతో లవ్ త్వరలోనే ఎంగేజ్మెంట్ జరగబోతుంది అన్న వార్తలపై దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ..” మీడియా వాళ్లకి నా పెళ్లి అంటే చాలా ఇష్టం అనుకుంటాను. అందుకే ప్రతి రెండు నెలలకు ఒకసారి నా పెళ్లి చేస్తూనే ఉంటారు. ఫిబ్రవరిలో నా ఎంగేజ్మెంట్ కూడా చేసేస్తున్నారు “అంటూ వెటకారంగా ఆన్సర్ ఇచ్చాడు.

అంతేకాదు ప్రస్తుతం మా కెరియర్ల పరంగా మేము బిజీ బిజీగా ఉన్నామని ..పెళ్లి ఆలోచన లేదు అని ..ఈ వార్తలను ఫ్యాన్స్ నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చారు. ప్రెసెంట్ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండనే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు బ్రేక్ పడిన్నట్లైంది..!!