బంపర్ ఆఫర్ కొట్టేసిన శంకర్.. మరో రోబో లాంటి హిట్ పక్క.. రాసి పెట్టుకోండి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ -కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ఆయన సినిమాల ద్వారా తెలుగు హిందీలో కూడా పాపులర్టీ దక్కించుకున్నాడు . తెలుగులో కూడా శంకర్ కి బిగ్ మార్కెట్ ఉంది.  ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్  అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు .

ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అంటూ మెగా అభిమానులు చెప్పుకొస్తున్నారు . అయితే చిరంజీవి కొడుకు చరణ్ కెరియర్ లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో జనాలు చెప్పుకుంటున్నారు . ఇలాంటి క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ని డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చింది అన్న వార్త వైరల్ అవుతుంది.

షారుఖ్ ఖాన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందట . ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్గా నటించబోతుందట . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమధ్య కాలంలో షారుఖ్ ఖాన్ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలను చూస్ చేసుకుంటూ వస్తున్నారు. మొదటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ ఆ తర్వాత డుంకి సినిమాల్లో నటించి తనలోని డిఫరెంట్ యాంగిల్ ను బయటపెట్టిన షారుక్ ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి అవకాశం ఇచ్చాడు..!!