రామ లక్ష్మణుల లాంటి…చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య గొడవ పెట్టిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రామలక్ష్మణుల లాంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ ల మధ్య  ఓ స్టార్ డైరెక్టర్ చిచ్చుపెట్టాడా..?? అంటే ఎస్ అన్న కామెంట్ లే  వినిపిస్తున్నాయి . ఆయన ఎవరో కాదు ఎస్ జే సూర్య. ఈయన  దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఖుషి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.  అయితే ఈ సినిమా తర్వాత ఆయన కోలీవుడ్ లో తెరకెక్కించిన వాలి సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాలి అని అనుకున్నాడట .

కానీ చిరంజీవి ఒప్పుకొనే ఒప్పుకోలేదట.  వాలి సినిమాలో అజిత్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడు.  హీరో ఆయనే విలన్ ఆయనే.  ఒకవేళ పవన్ కళ్యాణ్ అలా విలన్ పాత్ర కూడా తానే చేసుంటే కచ్చితంగా ఆయన ఇమేజ్ డామేజ్ అవుతుంది అని అందుకని చిరంజీవి ఈ సినిమా చేయొద్దు అంటూ చాలా మొండి పట్టుదల పట్టారట.  అన్న మాటకు గౌరవించి పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయలేదు.

అయితే వాలి సినిమా తెలుగులో డబ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ టైంలో పవన్ కళ్యాణ్ – చిరంజీవి ల  మధ్య మనస్పర్ధలు వచ్చాయట. ఒకవేళ ఆరోజు చిరంజీవి మాట వినకుండా పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో నటించి ఉంటే కచ్చితంగా పవర్ స్టార్ అయ్యుండేవాడు కాదు అంటున్నారు జనాలు . అభిమానులు కూడా ఇదే ఫీలింగ్ వ్యక్తం చేస్తున్నారు.  పవన్ కళ్యాణ్ లో విలన్ షేడ్స్ లేవని విలన్ పాత్రలకు ఆయన సూట్ అవ్వదు అని చెప్పుకొస్తున్నారు..!!