ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్.. ఇంతకంటే ప్రూఫ్ కావాలా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో నందమూరి అభిమానులు సరికొత్త న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమా రిజెక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుందా ..? అంటే ఎస్ అన్న  సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం .

కాగా తారక్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే హీరోలు చేసి ఫ్లాప్ కొట్టిన దాఖలాలు ఉన్నాయి.  వక్కంతా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నా పేరు సూర్య నా ఊరు ఇండియా సినిమా మొదటగా ఎన్టీఆర్ కి వివరించారట డైరెక్టర్ . కానీ తారక్ రిజెక్ట్ చేశాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.  ఆ తర్వాత నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా తారక్ చేతికే వెళ్లింది . అయితే తారక్ రిజెక్ట్ చేశారు .

ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది . రీసెంట్గా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా మొదటగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి వివరించారట. అయితే ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఈ కథ మహేష్ బాబు చేతి వద్దకు వెళ్ళింది . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.  ఇలా ఎన్టీఆర్ ఏ సినిమా రిజెక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!