“గుంటూరు కారం” ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా.. ఈ సంక్రాంతి మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేయచ్చో తెలిస్తే దిమ్మ్మ తిరిగిపోద్ది..!!

గుంటూరు కారం.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కెరియర్ లోనే ఎంతో అద్భుతంగా రాసుకున్న కథను ఈ సినిమా రూపంలో తెరకెక్కించారు . కాగా గుంటూరు కారం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఘాటైన హీటెక్కిస్తోంది.

ఇప్పటికే గుంటూరు కారం సినిమాకి సంబంధించిన పాటలు అభిమానులను ఊపేస్తున్నాయి . కొద్ది గంటలే మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ట్రేడ్ వర్గాలు ఈ సినిమా ఫస్ట్ త్రీ డేస్ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో అని అంచనా వేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి మూడు రోజులు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టబోతుంది అంటూ తెలుస్తుంది.

 

ఈ సినిమాకి మొదటి రోజు దాదాపు 40 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ల తో 20 కోట్ల లెక్క తేలిపోయింది. మరో 20 కోట్లు మిగతా టికెట్ల నుంచి రాబోతున్నాయి. అంతేకాదు ఈ సంక్రాంతి ఫెస్టివల్ మూడు రోజుల్లోనూ 100 కోట్ల వరకు ఈ సినిమా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి . మరీ ముఖ్యంగా కూర్చి మడత పెట్టి సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా మారబోతుంది అంటూ కూడా అభిమానులు చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!