ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోయిన్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక నిన్న మొన్నటి వరకు తమన్నా, రకుల్ ప్రీత్ పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇక వీరి బాటలోనే తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ అండ్రియ జెర్మియా కూడా వైవాహిక జీవితంలోనికి అడుగుపెట్టబోతుందట. హీరోయిన్ ఆండ్రియా జెర్మియా, ఓ తమిళ్ ప్రొడ్యూసర్‌తో కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉందంటూ సమాచారం. ఇద్దరూ తమ రిలేషన్ షిప్ ను ఎక్సెప్ట్ చేయక పోయినా ఓపెన్ గానే ఉన్నారు.
సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఆ మధ్య ఆండ్రియా అతనితో కలిసి రీల్స్‌లో కూడా సందడి చేసింది. కానీ, తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు అంటూ వివరించింది. ఇక తాజాగా న్యూ ఇయర్ వేడుకలను కూడా అతనితోనే ఆండ్రియా జెర్మియా సెలబ్రేట్ చేసుకుంటూ ఆ ఫొటోల్ని కూడా షేర్ చేసుకుంది. అలా కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఆండ్రియా జర్మియాకు.. ఆ నిర్మాత వివాహానికి ఆమె కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ప్రథమార్థంలో ఈ జంట ఒకటవన్నునారు.
కాగా ఇప్పటికే ఆ నిర్మాతకి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారట. కానీ భార్యకు అతను కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. రెండేళ్ల క్రితం ఓ వెబ్ సిరీస్ కోసం ఆ ప్రొడ్యూసర్ యాండ్రియాని కలిసినట్టు తెలుస్తుంది. వీరిద్దరి మధ్యన పరిచయం కాస్త ప్రేమగా మారిందని గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు తమ బంధాన్ని పెళ్లితో అఫీషియల్ గా మార్చుకోవాలని భావిస్తున్నారట.