వరుణ్ తో పెళ్లి.. ఆ వ్యక్తికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఫ్యాన్స్ షాక్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లు వీళ్ళ ప్రేమాయణాన్ని సీక్రెట్ గా నడిపిన ఈ జంట నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్ళింది . ఆ పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

రీసెంట్గా లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. లావణ్య త్రిపాఠి తన పెళ్లిలో వేసుకున్న కాస్ట్యూమ్స్ చాలా ఆకర్షణీయంగా అనిపించాయి. అందరూ కూడా ఈ కాస్ట్యూమ్‌స్ పై పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తన పెళ్లికి ఎంతో ప్రత్యేకంగా డ్రెస్సెస్ డిజైన్ చేసిన మనీష్ మెల్హోత్రాకు ఆమె స్పెషల్గా థాంక్స్ చెప్పింది. పెళ్లి జరిగిన 2 నెలల తర్వాత ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు .

లావణ్య- వరుణ్ పెళ్లికి ప్రత్యేకంగా డ్రెసెస్ డిజైన్ చేసినందుకు ఆమె మనీష్ మెల్హోత్రాకు థాంక్స్ చెప్పారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు ప్రజెంట్ లావణ్య వరుస సినిమాలతో సిరీస్ లతో బిజీ బిజీ గా ముందుకు వెళ్లింది. ఆమె తన లైఫ్ ని ఆమె అనుకున్నట్లే ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. వరుణ్ కూడా పలు సినిమాలతో బిజీ బిజీ గా ముందుకు వెళ్తున్నాడు..!!