మహేష్ ఎమోషనల్ కామెంట్స్ పై స్పందించిన నమ్రత శిరోద్కర్.. వైరల్ అవుతున్న పోస్ట్..!

మహేష్ భార్య నమ్రత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఒకప్పుడు నటిగా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అనంతరం మహేష్ ని పెళ్లి చేసుకుని కుటుంబానికి అంకితం అయిపోయింది. పిల్లలని చూసుకుంటూ మహేష్ వ్యాపారాలను అంటిపెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.

ఇక మహేష్ తాజాగా నటిస్తున్న గుంటూరు కారం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆ కామెంట్స్ పై నమ్రత ఓ పోస్ట్ ద్వారా స్పందించింది. ” మహేష్ సూపర్ ఫ్యాన్ గురించి మాట్లాడే చివరి వ్యక్తిని బహుశా నేనే అనుకుంటున్నా.

రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పై అపారమైన ప్రేమను కురిపించారు. అభిమానులు అన్నివేళలా ఆయనకు మద్దతుగా ఉన్నారు. మీరు మద్దతు ఇస్తే మరింత కష్టపడి పని చేసేలా చేస్తాను. గుంటూరు కారం లో ఫ్యాన్స్ చూపించిన ప్రేమను చూసి ఒక క్షణం గర్వంగా ఫీల్ అయ్యా. మహేష్ ఫ్యాన్స్ కి ఒక ఎమోషన్ ” అంటూ రాసుకొచ్చింది నమ్రత. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.