అయోధ్య కి విరాళం ఇచ్చిన ఆ స్టార్ హీరోయిన్.. కానీ ఇంకా ఆహ్వానం అందలేదట..!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అయోధ్యలో నిర్మాణం అవుతున్న రామాలయం కోసం విరాళం ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నటి ప్రణీత కూడా విరాళం అందించింది. ఈ విషయాన్ని ఈమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఇది చారిత్రక ఉద్యమం అని ఇందులో అందరూ చెయ్యి చెయ్యి కలపాల్సిందిగా కోరింది ప్రణీత. ” అందరికీ నమస్కారం. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం నిధుల సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను కూడా ఇందులో చేతులు కలిపాను. మీరందరూ కూడా చెయ్యి చెయ్యి కలపాల్సిందిగా కోరుతున్నాను.

జై శ్రీ రామ్ ” అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ విరాళం ఇచ్చినప్పటికీ ఈమెకి మాత్రం అయోధ్య నుంచి ఆహ్వానం రాలేదట. ఇక ఆహ్వానం రానందున ఈ ముద్దుగుమ్మ చాలా ఫీల్ అవుతుంది కూడా నట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.