నాగార్జున ” నా సామి రంగ ” మూవీలో అసలు ట్విస్ట్ ఇదేనా.. అల్లరి నరేష్ పాత్ర పై రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..!

యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగర్జున హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది కూడా. ఇక ఇదిలా ఉంటే.. నా సామిరంగా లో ఇద్దరూ యువ హీరోలు రాజ్ తరుణ్, అల్లరి నరేష్ నటిస్తుండగా.. ఇందులో నరేష్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉన్నట్లు సమాచారం.

అంతేకాకుండా అల్లరి నరేష్ పాత్రను చేయడం కోసం ప్రత్యేక గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఇక దీంతో నరేష్ పాత్ర పై నెట్టింట కొంత రచ్చ మొదలైంది. ఈ మూవీలో అసలు విలన్ నరేష్ అనుకుంటా.. అందుకే ఇంత స్పెషల్ గ్లింప్స్ నీ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఇదే ట్విస్ట్ అయ్యుండొచ్చు అంటూ సోషల్ మీడియాలో కొందరు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.