భర్తను పక్కన పెట్టేసి దానితో తెగ ఎంజాయ్ చేస్తున్న లావణ్య.. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటే..

టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఉత్తరాది అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె నటించిన మొదటి సినిమాకు మంచి సక్సెస్ రావడంతో తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు మిడిల్ రేంజ్‌ హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించిన లావణ్య.. మెగా కాంపౌండ్‌లో అల్లు శిరీష్, సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్ తో పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

Newlyweds Varun Tej and Lavanya Tripathi celebrate their first Diwali  together | Times of India

అయితే మిస్టర్ సినిమా షూటింగ్ టైంలో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక వివాహం తర్వాత హనీమూన్, వెకేషన్స్ అన్ని పూర్తి చేసుకుని వచ్చిన ఈ జంట.. ప్రస్తుతం ఎవరి పనిలో వారు బిజీ అయ్యిపోయారురు. వరుణ్ తన మట్కా సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. దీంతో వరుణ్ తేజ్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండగా.. లావణ్య త్రిపాఠి మాత్రం తన పుట్టింటిలో ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం డెహ్రాడూన్ లో ఈమె ఉన్న‌ సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఎలాంటి సినిమాలకు కమిటీ అవ్వకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో తన పెట్ డాగ్‌తో కలిసి వర్క్ అవుట్ లు చేయడం, ఎక్కడికి వెళ్లినా దాంతో లావణ్య కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనతో కలిసి ఆ కుక్క వెళుతుండగా ఈ వీడియోని షేర్ చేస్తూ.. మీ అండ్.. మై గర్ల్ అంటూ లవ్ సింబల్ తో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసుకుంది. ఈ వీడియో పై పలువురు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. భర్తను ప‌క్క‌న పెట్టేసి దాంతో ఎంజాయ్ చేస్తున్నారా మేడం.. కాస్త మా వరుణ్ అన్నని కూడా పట్టించుకోండి అంటూ.. వరుణ్ ని వదిలేసి దాని వెనకాల పడ్డావేంటి లావ‌ణ్యా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.