కమల్ హాసన్ ” థగ్ లైఫ్ ” మూవీ కోసం టాలెంటెడ్ యాక్ట్రెస్ ని దింపిన మణిరత్నం..!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా కమల్ హాసన్ హీరోగా దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 37 ఏళ్ల తరువాత ” థగ్ లైఫ్ ” అనే సినిమా కోసం జతకట్టారు. కమల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేసింది.

కొద్దిసేపటి క్రితం.. ప్రతిభావంతులైన నటులు జోజు జార్జ్ మరియు గౌతమ్ కార్తీక్ ఈ సినిమా కోసం బోర్డులోకి వచ్చారని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్ మరియు జయం రవి కూడా ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు.

ఇక ప్రస్తుతం జోజు జార్జ్ మరియు గౌతమ్ కార్తీక్ పేరులు స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. ఇక ఈ గ్లింప్స్ నీ చూసిన ప్రేక్షకులు..” మొత్తానికి టాలెంటెడ్ యాక్ట్రెస్ ని బరిలోకి దింపావు కదా మణిరత్నం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.