ఆ విషయంలో శ్రీ లీలను బలవంతం పెట్టిన థమన్.. పాపం అంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీలా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ డాన్స్, నటన, అందనికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ప్రతి సినిమాలోని ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కనిపిస్తుంది.

ఇక రీసెంట్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ తో డాన్స్ సమానంగా స్టెప్పులేసి.. శేఖర్ మాస్టర్ ని మించి పోయావుగా శ్రీ లీల అంటూ నెట్టింట ప్రశంసల వర్షం కురిపించుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం నిన్న గుంటూరు కారంలో శ్రీ లీల డాన్స్ కి నేను ఫిదా అని తెగ పొగిడేశారు. శ్రీ లీల డాన్స్ అంటే హీరోలకు తాట ఊడిపోవాల్సిందే అని కామెంట్స్ చేశాడు మహేష్.

ఇక రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ..శ్రీలీల తో స్టేజ్ మీద పాట పాడించి.. కుర్చీ మడత పెట్టి స్టెప్పు లేపించాలని బాగా ట్రై చేశాడు. కానీ ఈ బుట్ట బొమ్మ మాత్రం థమన్ కు ఛాన్స్ ఇవ్వలేదు. ” కూ..కు..కూ ” అని ముందు వచ్చే లైన్ హమ్ చేశారు అయితే పాట మాత్రం పడలేదు. డాన్స్ చేయలేదు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.