సూర్య ని చూసి నేర్చుకోండిరా.. ఎన్టీఆర్ కోసం ఎంత పెద్ద త్యాగం చేశాడొ చూడండి..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎంత టఫ్ ఫైట్ నెలకొందో మనం చూస్తున్నాం. ఒక హీరోకి మరొక హీరో సపోర్ట్ చేస్తే ఆ హీరోకి మరొక హీరో యాంటీ అయిపోతున్నాడు. అలాంటి సిచువేషన్ నెలకొంది . అలాంటి పరిస్థితుల్లోనూ కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో సూర్య మన ఎన్టీఆర్ కోసం తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆకట్టుకుంటుంది. సూర్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కంగువ. ఈ సినిమాతో సినీ చరిత్రను తిరగరాయబోతున్నాడు అంటూ జనాలు ఇప్పటికే ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు.

నిజానికి ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారట మేకర్స్. కానీ ఏప్రిల్ 5 ఎన్టీఆర్ నటించిన దేవర రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని డిసైడ్ అయ్యారట . అంతేకాదు ఒక హీరో సినిమాకి మరొక హీరో సినిమా కాంపిటీషన్ అవ్వకూడదు అని సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ హెల్తీగా ముందుకు వెళ్లాలి అని.. పెద్ద మనసుతో ఎన్టీఆర్ కోసం సూర్యనే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయమంటూ సజెస్ట్ చేస్తారట .

అంతేకాదు సూర్య ఈ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . రియల్ ఫ్రెండ్షిప్ అంటే ఇదేరా మామ అంటూ పొగిడేస్తున్నారు. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో సూర్య పవర్ ఫుల్ యోధుడిగా నటించాడు. ఈ చిత్రం 3డీ ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన తన పోర్షన్స్ పూర్తి చేశానని సూర్య తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.