మరికొద్ది గంటల్లో గుంటూరు కారం రిలీజ్.. అద్దిరిపోయే ట్విస్ట్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్..!!

ఇది నిజంగా మహేష్ బాబు అభిమానులకు వెరీ వెరీ గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ అనే చెప్పాలి . కొద్దిగంటలే కేవలం మరికొద్ది గంటల్లోనే గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ఫస్ట్ షో పడబోతుంది . ఇప్పటికే థియేటర్స్ వద్ద మహేష్ బాబు అభిమానుల హంగామా ఎలా ఉందో మనం చూస్తున్నాం . భారీ భారీ కటౌట్లు.. ఫ్లెక్సీలతో.. పూలదండలతో పాలాభిషేకాలతో రంబోలా చేస్తున్నారు. ఇలాంటి టైంలోనే సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేస్తూ హైప్స్ ఇస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గుంటూరు కారం సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో ని రిలీజ్ చేశారు .

ఈ వీడియో చూసిన అభిమానులు సంబరపడిపోతున్నారు . ఫైటింగ్ సీన్స్ చిత్రీకరణలో మహేష్ బాబు ఎంత కష్టపడ్డాడో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు .. మాస్ ప్రేక్షకులకు మరింత నచ్చేలా మహేష్ బాబు కొత్త అవతారం ఎత్తడానికి ఎంత కష్టపడ్డాడు అని బాగా ఈ వీడియోలో మనం చూడొచ్చు . ఈ మేకింగ్ వీడియో చూస్తే మహేష్ ఆటపాట మామూలుగా ఉండదనిపిస్తుంది . ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా మీనాక్షి చౌదరి – శ్రీ లీల నటిస్తున్నారు .

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్.. సాంగ్స్ సినిమా మీద అంచనాలను పెంచేసాయి. ఈ మూవీ నుంచి రిలీజైన ‘కుర్చీ మడతపెట్టి ’ సాంగ్ కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా ఈ పాటే మోత మోగిపోతోంది. రీసెంట్ గా గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మంచి ఆదరణ లభించింది. రమ్యకృష్ణ – ప్రకాష్ రాజ్ – జగపతిబాబులు కీలకపాత్రలు ఈ సినిమాలో పోషించారు . హాసిని హారిక క్రియేషన్స్ పతాకం పై నిర్మితమైతమవుతున్న ఈ చిత్రం మరికొద్ది గంటలోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.