మాజీ మామకు గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన సమంత..”నా సామీ రంగా” అనాల్సిందే..!

కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా సరే మన పేరు నెగటివ్గా ట్రోల్ అవుతూ ఉంటుంది . మనం మంచి చేయాలని చూసినా సరే అది ఆటోమెటిగ్గా నెగటివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ మరీ ముఖ్యంగా సమంత అలాంటి చిక్కుల్లో బాగా ఇరుక్కుంటుంది . హీరోయిన్ సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే . వీళ్లు విడాకులు తీసుకొని రెండేళ్లు దాటిపోతుంది.

అయినా వీళ్ళకి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది . రీసెంట్ గా హీరోయిన్ సమంత – తేజ సజ్జ హనుమాన్ సినిమాను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది . అందులో ఏమాత్రం తప్పులేదు . కానీ కొందరు మాత్రం ఇది పరోక్షకంగా అక్కినేని నాగార్జునకు రాడ్ దించేయడమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మహేష్ బాబు గుంటూరు కారం , నాగార్జున నా సామిరంగా , వెంకటేష్ సైంధవ్ సినిమాలను పట్టించుకోకుండా ..

కేవలం తేజ సినిమాను మాత్రమే ప్రమోట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు జనాలు. మరికొందరు మాజీ మామకు ఇచ్చి పడేసింది అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తుంటే ..ఇంకొందరు అది ఆమె అభిప్రాయం మీకు ఎందుకురా మూసుకొని మీ పనులు చూసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా రోజుల తరువాత సమంత పేరు మళ్ళీ ఈస్ధాయిలో ట్రెండ్ అవుతూ ఉండటం గమనార్హం..!!