ఇరగదీసిన లావణ్య త్రిపాఠి.. లావణ్య Miss Perfect వెబ్ సిరీస్ టీజర్ చూశారా(వీడియో)..!

లావణ్య త్రిపాఠి.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు బాగా వైరల్ అవుతుంది. అంతకుముందు హీరోయిన్గా పరిచయంగా ఉన్న లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఇంటికి కోడలుగా బాగా పాపులారిటీ దక్కించుకుంది . వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటించాలి అంటూ బోల్డ్ డెసిషన్ తీసుకుంది . అంతేకాదు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది .

తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది . మిస్ పర్ఫెక్ట్ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా లావణ్య త్రిపాఠి ఇందులో ఓసిడి గల అమ్మాయి రోల్ లో కనిపిస్తుంది . ఆమె డైలాగ్స్ .. ఆమె పెర్ఫార్మెన్స్ డ్రెస్సింగ్ సెన్స్ మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . ఈ క్రమంలోనే ఓసిడి పాత్రలో లావణ్య త్రిపాఠి చించేసింది అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సిరీస్ లో ఝాన్సీ , హర్షవర్ధన్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు . అంతేకాదు ఈ సిరీస్ తో మంచి కం బ్యాక్ హిట్ అందుకోబోతుంది లావణ్య అంటూ ప్రమోట్ చేస్తున్నారు . చూద్దాం మరి మన మెగా కోడలు లావణ్య ఈ సిరీస్ తో ఎలాంటి హిట్ అందుకోబోతుందో..?? మరెందుకు ఆలస్యం అందర్నీ ఆకట్టుకుంటున్న ఈ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ టీజర్ మీరు చూసేయండి..!!