చిరునవ్వులు చిందిస్తూ అమ్మ ఒడిలో కనిపిస్తున్న ఈ బుజ్జి పాపని గుర్తుపట్టారా.. ఆమె సౌత్ లో బిజీ హీరోయిన్..?!

గత కొంతకాలంగా త్రో బ్యాక్ థీం తో సినీ సెలెబ్రిటీస్ చిన్నప్పటి పిక్స్‌ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ బుజ్జి పాప ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కొంతకాలం క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె పలు సినిమాల్లో నటించిన పార్త‌ల‌కు ప్రాధాన్యత లేకపోవడంతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు.

ActressBuff on X: "Meenakshi Chaudhary 🤎💙 https://t.co/wfivXHPyvB" / X

అయితే ఇటీవల కాలంలో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ లో ఫుల్ బిజీగా గడుపుతుంది. 2018 లో ఫెమినా మిస్ ఇండియా విజేతగా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా. ఆమె మీనాక్షి చౌదరి. సుశాంత్ హీరోగా చేసిన ఇచట వాహనాలు నిలపరాదు సినిమాలో హీరోయిన్గా చేసింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆమె స్క్రీన్ ప్రజెంట్ కు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత రవితేజ కిలాడి సినిమాలో నటించింది. మాస్ పాటలకు రవితేజతో గట్టి పోటీ ఇస్తా స్టెప్పులు వేసిన ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ అందాలతో కుర్రాలను కవ్వించింది.

Update more than 139 meenakshi chaudhary saree best - vietkidsiq.edu.vn

ఆ తర్వాత హిట్‌2 సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఇక తాజాగా గుంటూరు కారం సినిమాతో జాక్‌పాట్ తగిలింది. ఇక ఈ సినిమా నుంచి మొదలుకొని వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ బిజీ బ్యూటీ అయిపోయింది. విశ్వక్‌సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్‌తో పలు సినిమాల్లో నటిస్తుంది. దీంతో పాటు కోలీవుడ్ హీరో విజయ్ సినిమాలో కూడా ఈమె నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మకు ఈమె నటించే సినిమాలన్నీ సక్సెస్ వస్తే మరికొన్ని ఏళ్ళు స్టార్ హీరోయిన్గా దూసుకుపోవడం ఖాయం అంటూ సినీ వర్గాల అభిప్రాయం.