కొత్త సంవత్సరంలో రికార్డులు బ్రేక్ చేసే మూవీస్ ఇవే…!

గత ఏడాది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలుస్తూ.. మరికొన్ని మూవీస్ ని ప్లాన్ చేసి ప్రకటించారు. అయితే 2023 కు ముగింపు పలికి.. 2024లోకి అడుగుపెట్టాం. కాగా ఈ ఏడాదిలో పలు స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఆ సినిమాలంటే ఇప్పుడు చూద్దాం.

1. కొరటాల శివ – ఎన్టీఆర్:


వీరి కాంబోలో పాన్ ఇండియా మూవీ ” దేవర ” తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.

2. సుకుమార్ – అల్లు అర్జున్:


సుకుమార్, బన్నీ కాంబినేషన్లో గత ఏడాది తెరకెక్కిన పుష్ప ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

3. శంకర్ – రామ్ చరణ్:


వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న ” గేమ్ చేంజర్ ” మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.

4. త్రివిక్రమ్ – మహేష్ బాబు :


మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న ” గుంటూరు కారం ” నుంచి విడుదలైన ప్రతి ఒక్కటి ఎంతటి దుమారం రేపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

5. నాగ్ అశ్విన్ – ప్రభాస్:


నాగ్ అశ్విన్ దర్సకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ ” కల్కి “. ఈ మూవీ కూడా ఈ ఏడాది ప్రేక్షకుల‌ ముందుకి రానుంది.

6. సుజిత్ – పవన్ కళ్యాణ్:


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ” ఓజి ” అనే సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇలా మన స్టార్ హీరోలు అందరూ కూడా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రానున్నారు. మరి ఎంతమంది సక్సెస్ అవుతారో చూడాలి మరి.