ప్రభాస్ ” సలార్ ” మూవీ 10 డేస్ కలెక్షన్స్ ఇవే… డార్లింగా మజాకానా..!

ప్రభాస్ – ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ ” సలార్ “. ఈ సినిమాపై రెబల్ అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా..హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక దీంతో మొదటివారం సూపర్ కలెక్ట్ చేసింది. అలాగే రెండో వీకెండ్ లో కూడా బాగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇక పది రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..285.94 కోట్లు రాబట్టింది.

ఈ సినిమాకి రూ. 336.9 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ కావాలంటే కోట్ల షేర్ ను రాబట్టాలి. పది రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.285.94 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్‌ కి ఇంకా రూ.52.06 కోట్ల షేర్ ని వసూల్ చేయాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.