సారీ చెబుతూనే షారుఖ్‌కి 90ML రాడ్ దింపేసిన ” సలార్ ” మూవీ టీం… వైరల్ అవుతున్న పోస్ట్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. డిసెంబర్ 22న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ మీ సొంతం చేసుకుంది. ఇక దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక రీసెంట్ గానే నాలుగు రోజుల్లోనే రూ.450 కోట్ల మార్క్ దాటి 200 కోట్ల షేర్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇక ఇదిలా ఉంటే.. డిసెంబర్ 21న బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ” డంకీ ” సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తరువాత సలార్ రిలీజ్ కావడంతో డంకీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయి. ఇంక దీంతో ఎప్పటికప్పుడు సలార్ టీం ఎన్ని కలెక్షన్లు రాబట్టాయో పోస్ట్లు పెడుతున్నారు.

ఇక ఈ క్రమంలోనే తాజాగా పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు..” ఖాన్సార్… I’m Sorry” అంటూ ఈరోజు కలెక్షన్స్ అనౌన్స్ చేశారు. అయితే వారు ఉద్దేశపూర్వకంగా కాన్సర్ పదాన్ని ఉపయోగించారని నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. షారుఖ్ ను సార్ అని అభివర్ణిస్తున్నారు అని సమాచారం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రేక్షకులు…” సారీ అంటూనే షారుఖ్ కి 90ML రాడ్ దింపేశారుగా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.