” ఈగిల్ ” లో రవితేజ క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసిన కార్తీక్..!

మాస్ మహారాజ్ హీరోగా..కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ ” ఈగిల్ “. ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని రానున్న సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి టీజర్, ట్రైలర్, తో పాటు యువ సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. ఈ సినిమాలో హీరో రవితేజ రోల్ గురించి దర్శకుడు కార్తీక్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈయన మాట్లాడుతూ..” ఈ సినిమాలో రవితేజ రోల్ తమ వయసుకు తగ్గట్టే ఉంటుంది.

అతని జీవితంలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈగిల్ కథ సాగుతుంది. అలాగే హీరో పాత్ర యొక్క ఫ్లాష్ బ్యాక్ లో 15 నిమిషాల పాటు లవ్ స్టోరీ డ్రామా ఉంటుంది. మొత్తంగా తన రోల్ కోసం రవితేజ ఎంతో కష్టపడ్డాడు. ముఖ్యంగా ఆయనకి మేకప్ కూడా లేదు. తాను నేచురల్ గానే యాట్‌ చేశారు. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది ” అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.