కళ్యాణ్ రామ్ ” డెవిల్ ” 3 డేస్ కలెక్షన్స్ ఇవే…!

నందమూరి హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా.. సంయుక్త మీనన్ హీరోయిన్ గా.. అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” డెవిల్ “.

ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో ఆకట్టుకునే త్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో అజయ్, సీనియర్ నటి సీత, శ్రీకాంత్ అయ్యంగార్,ఎస్తేర్, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో పోషించారు.

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీకి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.16.32 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా ప్రకటించారు. ఇక రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకే రేంజ్ లో కలెక్షన్స్ రాబ‌డుతుందో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.