నెలకు నాలుగుసార్లు బన్నీ భార్య స్నేహారెడ్డి .. తిరుమల ఎందుకు వెళ్తుందో తెలుసా..? పెద్దింటి కోడలు ఇలా కూడా చేస్తారా..?

చాలామంది స్టార్ సెలబ్రిటీస్ బయట కనిపించడానికి ఇష్టపడరు. స్టార్ హీరోల భార్యలు కొంతమంది మాత్రమే అలా బయట ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తిరుగుతూ ఉంటారు. వాళ్లలో ఒకరే మన బన్నీ భార్య స్నేహ రెడ్డి . పైకి ఎంత స్టైలిష్ గా ఉంటుందో భక్తి భావం కూడా అంతాగానే ఉంటుంది . స్నేహ రెడ్డి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ట్రెండీగా ఉంటుంది. తన భర్త పిల్లలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటుంది .

సోషల్ మీడియాలో ఆమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు బాగా తెలిసిందే. బన్నీ కూడా అంత యాక్టివ్ గా ఉండడు. కాగా రీసెంట్ గా స్నేహ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకునింది . శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె బయట మీడియా కంట కనపడింది. అయితే ఆమెతో కూతురు- కొడుకు – బన్నీ – కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకుండా ఉండడం గమనార్హం. రీసెంట్ గానే స్నేహ రెడ్డి తన కూతురు అల్లు అర్హతో శ్రీవారిని దర్శించుకునింది .

సరిగ్గా నెలకూడా తిరగకముందే మళ్లీ స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . అయితే స్నేహ రెడ్డి ఏ పని మొదలుపెట్టిన ఏ పని సక్సెస్ అయిన శ్రీవారిని దర్శించుకుంటుందట. ఆమెకి మొదటి నుంచి అలవాటు ఉందట . ఆ కారణంగానే రీసెంట్గా నటించిన యాడ్ సూపర్ సక్సెస్ అవ్వడంతో స్నేహారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. పెద్దింటి కోడలైనా సరే స్నేహ రెడ్డి పద్ధతులను బాగా ఫాలో అవుతుంది అంటున్నారు బన్నీ అభిమానులు..!!