మీలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే ప్రోటీన్ లోపం ఉన్నట్లే.. ఇంతకీ అవేంటంటే..?

ప్రతి ఒక్కరికి శరీరానికి సరిపడా పోషకాలు ఖచ్చితంగా అవసరం. లేకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలు అన్ని సమపాళ్లల్లో ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఇలా ఏవి తక్కువైనా వాటి ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది. ఫలితంగా ఎన్నో రోగాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగని అధిక పోషకాలు ఉన్నా ప్రమాదమే. కాబట్టి అన్ని సమపాళ‌లో ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో చాలా మంది ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని అన్ హెల్తి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం కలుగుతుంది.

దీంతో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. తరచు ఇన్ఫెక్షన్లు, పలు రోగాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. మరికొందరిలో అయితే జుట్టు రాలడంతో పాటు చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇక శరీరంలో ప్రోటీన్ లోపం తక్కువైతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో చాలామంది కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. ఏ చిన్న పని చేయాలన్నా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. దీనితో శరీర ఆకృతిని కూడా కోల్పోతున్నారు. ప్రోటీన్ లోపం వల్ల కూడా కండరాల బలహీనత సమస్య తలెత్తుతుంది.

అలాగే ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు జుట్టు విపరీతంగా రాలుటం, కొంతమందికి తెల్ల జుట్టు కూడా కనిపిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. ప్రతి చిన్న విషయానికి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. కొంతమందిలో ఈ లోపం కారణంగా బరువు త్వరగా కోల్పోతారు. తరచూ అధికమోతాదులో బరువు తగ్గిపోతుంటే ప్రోటీన్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. ప్రోటీన్ లోపం వల్ల గోర్లు కూడా త్వరగా విరిగిపోతాయి. పేలవంగా కనిపిస్తాయి. కనుక కండరాల బలహీనత, జుట్టు విపరీతంగా రాలిపోవడం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడడం, బరువు ఒక్కసారిగా తగ్గిపోవడం లాంటి సమస్యలు మనలో కనిపిస్తుంటే ఒకసారి ప్రోటీన్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు.