త్రివిక్రమ్ చేతిలో నెక్స్ట్ బకరా అవ్వబోయే ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఫ్యాన్స్ గగ్గోలు..!

త్రివిక్రమ్ శ్రీనివాసరావు.. ఒకప్పుడు ఈ పేరు చెప్తే హిట్ కి మరో మారుపేరు అంటూ పొగిడేసే వాళ్ళు . అలాంటి కథ కంటెంట్ స్టోరీ లైన్ తో ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఒకానొక టైం లో స్టార్ హీరోలు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు . అంతేకాదు ఆయన కోసం వెయిట్ చేసే వాళ్ళు.. అయితే అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గురించి ఇప్పుడు మనం ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో మనకు తెలిసిందే.

మరీ ముఖ్యంగా గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అంటూ వచ్చిన టాక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కెరియర్ కు భారీ దెబ్బ కొట్టింది . ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కథలు అంటే.. ఓ అమ్మ – ఓ అత్త- ఓ కొడుకు- ఒక నాన్న ఇవి ఖచ్చితంగా ఉంటాయి అని.. అదే ఇల్లు ..అదే బావ మరదళ్ల సరసాలు.. అదే డైలాగులు అంటూ నాటి గానే ట్రోల్ చేస్తున్నారు జనాలు . అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చేతిలో నెక్స్ట్ బలైపోయే హీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది .

ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో బన్నీ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. అంతేకాదు నాని – వెంకటేష్ తో మల్టీసారర్ తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్ అంటూ కూడా టాక్ వినిపిస్తుంది . మరి ఏ హీరో బలవబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ గగోలు పెడుతున్నారు . బన్నీని ఆయన డైరెక్షన్లో సినిమా చేయొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో స్టేటస్ సంపాదించుకున్న తర్వాత ఫ్లాప్ పడితే బాగోదు బన్నీ అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!