గొప్ప మనసు చాటుకున్న సితార.. అనాధ పిల్లల కోసం ఏం చేసిందంటే..?

మహేష్ కూతురు సీతార నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక స్టార్ హీరోయిన్ కు ఉండేంత రేంజ్ లో సితారకు పాపులారిటీ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తండ్రి మహేష్‌కు తగ్గట్లుగానే సితార కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు తన గొప్ప మనసు చాటుతూనే ఉంటుంది. ఎంతో మంది ప్రశంసలు అందుకుంటుంది.

ఇక ఇప్పటికే పలు యాడ్ షూట్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న మహేష్ గారాల పట్టి.. ఇటీవల పెరటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా సితార మరోసారి అనాధ పిల్లల విషయంలో తన మంచి మనసును చాటుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన పనికి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తుంది.

అసలు విషయం ఏంటంటే సితార పాప అనాధ పిల్లలకు నాన్న మహేష్ బాబు నటించిన గుంటూరు కారు సినిమాకు ఏఎంబి థియేటర్లో స్పెషల్ షో ఏర్పాటు చేయించి వారితోపాటు ఆ సినిమాను ఆమె కూడా చూస్తూ ఎంజాయ్ చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్న సితార వారందరితో కలిసి సినిమాలు చూడడంతో త‌న‌ ఆనందాని తెలియజేసింది. ప్రస్తుతం ఆమె పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.