జుట్టుకు రైస్ వాటర్ వాడితే ఇన్ని ప్రయోజనాల.. ఇంతకాలం తెలియక వేస్ట్ చేశామే..!

చాలామందికి జుట్టు అంటే చాలా ఇష్టం. ఇందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ మనం ఇంట్లో వేస్ట్ గా పడేసే రైస్ వాటర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా. రైస్ వాటర్ లో అమినో యాసిడ్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి.

రైస్ వాటర్లో ఇవి ఎక్కువగా ఉండడం ద్వారా మన జుట్టు పెరగడానికి సహాయపడతాయి. అంతేకాకుండా చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తాయి. బియ్యం నీటిలో ఉండే ప్రోటీన్లు జుట్టు ని బలంగా చేస్తాయి. ముఖ్యంగా జుట్టు ఊడిపోకుండా కాపాడతాయి.

రైస్ వాటర్ లో ఉండే పోషకాలు, విటమిన్లు మొత్తం జుట్టు ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తాయి. చుట్టూ చీలడాన్ని తగ్గిస్తాయి. రైస్ వాటర్ జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది. ఇది రోజువారి వాడకపోయినా కనీసం భారానికి రెండు మూడు సార్లు హెయిర్ కి అప్లై చేసుకోవడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. అందువల్ల ఈ రైస్ వాటర్ ని వేస్ట్ గా పడేయకుండా జుట్టుకి అప్లై చేసుకోవడం చాలా మంచిది.