నందమూరి అభిమానులకి బిగ్ బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో ఏమో..?

ఇది నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్ అని చెప్పాలో బ్యాడ్ న్యూస్ అని చెప్పాలో అర్థం కావడం లేదు . నందమూరి అభిమానులకి బాలయ్య ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు . నందమూరి ఫ్యామిలీకి పెద్దదిక్కుగా నందమూరి బాలయ్య ముందుకు వెళ్తున్నారు . కాగా మరికొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి . ఇందులో టిడిపి ఘనవిజయం సాధించబోతుంది అంటూ సర్వే లెక్కలు వివరిస్తున్నాయి .

ఇలాంటి క్రమంలోనే నందమూరి అభిమానులకు బిగ్ డౌట్ వచ్చింది. ఇప్పుడు టిడిపి విన్ అవ్వడం పక్కా.. చంద్రబాబు నాయుడు – బాలకృష్ణ రాజకీయాలలో బిజీగా మారిపోవడం కన్ఫామ్ . అలాంటప్పుడు మరి బాలకృష్ణ సినిమాల్లో నటిస్తారా ..? అంత టైం ఉంటుందా ..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది . కొంతమంది ప్రజాసేవ కోసం బాలకృష్ణ సినిమాలను వదులుకుంటారు.. అంటుంటే మరి కొంతమంది ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు బ్యాలెన్స్ చేయడం బాలకృష్ణ కు కొత్తేమీ కాదు.. గతంలో కూడా అలాగే బ్యాలెన్స్ చేశారు ..అంటున్నారు.

నందమూరి స్వర్గీయ తారక రామారావు గారి దగ్గర నుంచి ఆ క్వాలిటీస్ బాలకృష్ణ కు బాగా వచ్చాయి అంటున్నారు . మరి కొంతమంది మాత్రం బాబీతో చేసే సినిమానే లాస్ట్ అని ఆ తర్వాత తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసి బాలయ్య రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు . దీంతో నందమూరి ఫ్యాన్స్ కు ఎటు తేల్చుకోలేని అర్థం కాని పరిస్థితి నెలకొంది..!!