100 కోట్ల క్లబ్లో చేరిన హృతిక్ ” ఫైటర్ ” మూవీ.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొన్ హీరోయిన్ గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ” ఫైటర్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకుంది.

బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఆదివారం ఒక్కరోజే ఈ సినిమా 30.20 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడం జరిగింది. ఇక దీంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక మొత్తం ఇప్పటివరకు ఫైటర్ మూవీ 123.60 కోట్ల వసూళ్లను రాబట్టింది. అనిల్ కపూర్ ఇందులో మరో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

వయాకామ్ 18 స్టూడియోస్ మరియు మర్ప్లక్స్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీ లాంగ్ రన్ లో కూడా మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ మూవీ 100 కోట్ల ‌ క్లబ్లో చేరడంతో ఈ హీరో ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకుంటున్నారు.