మెగాస్టార్ ” విశ్వంభర ” మూవీ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మన టాలీవుడ్ లెజెండ్రీ హీరో చిరంజీవి మనందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల‌లో నటించిన చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ కానుండగా ఈ సినిమాపై మరిన్ని ఆశక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ఓ వార్త వినిపిస్తుంది. ఈ సినిమా విడుదలకి వచ్చే ఏడాది జనవరి కి ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి నేషనల్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలానే చోటా కే నాయుడు ఈ సినిమాకి విజువల్స్ ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.