యంగ్ సింహం వచ్చేస్తున్నాడ్రోయ్..సంక్రాంతికి ముందే పెద్ద పండగ తెచ్చిన బాలయ్య..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా కానీ నందమూరి బాలయ్య కు ఉన్న క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ హీరోకి లేదనే చెప్పాలి. సీనియర్ ఏజ్ వచ్చిన సరే యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలను ఓకే చేస్తూ కమిట్ అయిన సినిమాలను త్వరగా రిలీజ్ చేస్తూ తన సత్తాను చాటుకుంటున్నాడు బాలయ్య . కాగా రీసెంట్ గానే వీరసింహారెడ్డి .. ఆ తర్వాత భగవంత్ కేసరిలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్ని 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన బాలయ్య ..

 

ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న క్లూ కూడా బయటకు రానికుండా మెయింటైన్ చేస్తుంది మూవీ టీం . కాగా ఈ సినిమా షూటింగ్ 70% శాతం కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తుంది. కొన్ని పాటలు కొన్ని సీన్స్ మినహా సినిమాలోని అన్ని సీన్స్ పాటలు షూటింగ్ కంప్లీట్ చేసేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన బాలయ్య లుక్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.

 

వీరసింహారెడ్డి , భగవంత్ కేసరిలో మనం చూసిన బాలయ్య కంటే ఈ బాలయ్య మరింత బాగున్నాడు . అచ్చం 25 ఏళ్ల కుర్రాడిలా యంగ్ సింహంలా ఉన్నాడు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. అంతేకాదు ఆయన ఫోటోని తెగ ట్రెండ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఆయన లుక్ వైరల్ గా మారింది. ఏ మాటకు ఆ మాటే ఈ లుక్స్ లో మన బాలయ్య కెవ్వు కేక అనిపించేస్తున్నాడు..!!