“నా లైఫ్ లో అది జరగకపోతేనే హ్యాపీ గా ఉంటాను”.. మెగా డాటర్ ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏంటి..?

నిహారిక .. ఈ పేరు గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్గా కూడా సినిమాలు చేసింది . కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోవాలనుకునింది . కానీ అది కూడా జరగలేదు . ఆమె పెళ్లి చేసుకున్న జొన్నలగడ్డ చైతన్య ఆమెకు విడాకులు ఇచ్చి వెళ్లిపోయాడు.

దీంతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధపడింది నిహారిక . విడాకుల తర్వాత సోషల్ మీడియాలో చాలా బోల్డ్ గా ఫోటోషూట్స్ చేస్తూ బోల్డ్ నిర్ణయాలు తీసుకునే నిహారిక రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది . ఈ క్రమంలోనే ఓ నెటిజన్ సరదాగా ..”మీ చెయ్యి చూపించండి ” అంటూ ప్రశ్నిస్తాడు . దానికి నిహారిక ఫన్నీగా ఆన్సర్ ఇస్తుంది. ఆ ఆన్సర్ విన్న జనాలు నవ్వి నవ్వి పడి దొర్లిపోతున్నారు.

“ఎందుకురా ..?? నా జాతకం చెప్తావా..??? వద్దు రా బాబోయ్ వద్దు ..అది తెలుసుకోకుండా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను” అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చింది. దీంతో నిహారిక మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ప్రజెంట్ నీహారిక పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూనే..మరి కొన్ని సినిమాల్లో నటిస్తుంది. చూద్దాం ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ ఎలా కలిసి వస్తుందో..???