సంక్రాంతి బరిలో ముచ్చటగా మూడోసారి వెంకీ, నాగ్.. రెండుసార్లు ఆ హీరోదే పైచేయి..

సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల హ‌డావిడి మొదలవుతుంది. స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా వచ్చి వారి ఫ్యాన్స్ మధ్యన మంచి సంద‌డి నెలకొంటుంది. ఇప్పటికే కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ అయ్యే సినిమాల్లో హీట్ పెరిగిపోయింది. పండగ సెలవులు నేపథ్యంలో ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. కాగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ప్రస్తుతం అందరి చూపు ఆ ఇద్దరు హీరోల పైనే ఉంది. వారెవరో కాదు సీనియర్ హీరో నాగార్జున, వెంకటేష్. ఈ పండగకు నాగార్జున నా సామి రంగతో, వెంకటేష్ సైంధవ్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Naa Saami Ranga 1st Song Lyrical Video | Nagarjuna ,Ashika Ranganadh | Mm  Keeravani,Naa Saami Ranga - YouTube

ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. గతంలో కూడా ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో రెండుసార్లు పోటీపడ్డారు. కాగా రెండుసార్లు కూడా ఇద్దరి మధ్య సంక్రాంతి వారు జోరుగా జోరుగా సాగినా చివరికి విన్నింగ్ మాత్రం ఒకరికే సొంతమైంది. అతను ఎవరో కాదు మన వెంకి మామ. ఇద్దరు హీరోలు మొదటిసారి 1992 సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. నాగార్జున కిల్లర్ సినిమాతో.. వెంకటేష్ చంటి సినిమాతో బాక్సాఫీస్ బరిలో దిగారు. ఈ రెండు సినిమాల్లో చంటి బ్లాక్ బ‌స్టరై వెంకీకి సక్సెస్ తెచ్చి పెట్టింది.

విడుదల తేదిని మార్చుకున్న సైంధవ్.. అధికారిక ప్రకటన..

నాగార్జున కిల్లర్ సినిమా డీసెంట్ హిట్ అయ్యింది. 1996 సంక్రాంతి బరిలో ఈ స్టార్ హీరోస్ మళ్లీ తలపడ్డారు. నాగార్జున వజ్రంతో, వెంకటేష్ ధర్మచక్రం సినిమాలతో సంక్రాంతి బరిలో పోటీపడ్డారు. ధర్మచక్రం సూపర్ హిట్ అవ్వగా.. వజ్రం సక్సెస్ సాధించలేకపోయింది. అలా రెండుసార్లు నాగార్జునపై.. వెంకటేష్ డామినేషన్ క్లియర్ గా కనిపించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడబోతున్నారు. ఈసారి అయినా నాగ్‌ సక్సెస్ సొంతం చేసుకుంటాడా.. లేదా వెంకి మామకే ఇచ్చేస్తారా అనేది చూడాలి.